నటుడు రాజబాబు కన్నుమూత.. విషాదంలో సినీ ఇండస్ట్రీ.!

Actor raja babu passed away. తెలుగు సినీ నటుడు రాజబాబు కన్నుమూశారు. రాజబాబు (64) గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడు

By అంజి  Published on  25 Oct 2021 8:22 AM IST
నటుడు రాజబాబు కన్నుమూత.. విషాదంలో సినీ ఇండస్ట్రీ.!

తెలుగు సినీ నటుడు రాజబాబు కన్నుమూశారు. రాజబాబు (64) గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఇవాళ తెల్లవారుజామున మరణించారు. రాజబాబు స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా నరసాపురపేట. ఆయన భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రంగస్థల నటుడిగా జీవితాన్ని ప్రారంభించిన రాజబాబు.. ఎన్నో సినిమాలు, సీరియళ్లలో నటించారు. 1995లో వచ్చిన ఊరికి మొనగాడు సినిమాతో రాజాబాబు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. బాల్యం నుండే రాజబాబుకు నటనపై ఆసక్తి ఉండేది. దీంతో చిన్నప్పుడే రంగ స్థలం నాటకాల్లో రాణించాడు.

సముద్రం, సింధూరం, ఆడవారిమాటలకు అర్థాలే వేరు, శ్రీకారం, మురారి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కళ్యాణ వైభోగం, మళ్లీ రావా?, భరత్‌ అనే నేను, బ్రహ్మోత్సవం తదితర సినిమాల్లో రాజబాబు నటించారు. దాదాపు 62 సినిమాల్లో నటించారు. విభిన్నమైన పాత్రలు చేస్తూ వాటికి ప్రాణం పోసేవారు. వసంత కోకిల, అభిషేకం, రాధా మధు, మనసు మమత, బంగారు కోడలు, నా కోడలు బంగారం, బంగారు పంజరం వంటి ఎన్నో సీరియళ్లలో కూడా రాజబాబు తన నటనతో మెప్పించారు. బాబాయ్‌ అంటూ రాజబాబును అందరూ ఆప్యాయంగా పిలుచుకుంటారు. ఆయన మృతి సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. రాజబాబు మృతిపై ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Next Story