అంబటి రాంబాబుపై కీలక వ్యాఖ్యలు చేసిన 'శ్యాంబాబు' పాత్రధారి 'పృథ్వీ'
Actor Prithvi comments on Ambati Rambabu. పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'బ్రో' లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ పోషించిన శ్యాంబాబు క్యారెక్టర్ వివాదాస్పదమయింది.
By Medi Samrat Published on 31 July 2023 4:12 PM ISTపవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'బ్రో' లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ పోషించిన శ్యాంబాబు క్యారెక్టర్ వివాదాస్పదమయింది. దీనిపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు కూడా విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లో 'బ్రో' సక్సెస్ మీట్ లో పృథ్వీ మాట్లాడుతూ.. పృథ్వీగారు ఎందుకండీ మీ క్యారెక్టర్ ఇంత వైరల్ అయింది? అని సముద్రఖని గారు నన్ను అడిగారు. దీనికి సమాధానంగా సినిమాలో మంచి ఉందని, హ్యూమన్ వాల్యూస్, ఎమోషన్స్ ఉన్నాయని చెప్పాను. ఎంత సంపాదించినా చివరకు మట్టిలోకే వెళ్లాలని చెప్పిన పాయింట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిందని అన్నాను. అయినా నేను పోషించిన శ్యాంబాబు పాత్రకు ఇంత స్పందన వస్తుందని ఊహించలేదని చెప్పారు. సినిమాలో ఏపీ మంత్రిని కించపరిచేలా చేశారట అని కొందరు తనతో అన్నారని.. ఆ మంత్రి అంబటి రాంబాబు అని చెప్పారని వెంటనే తాను అంబటి రాంబాబు ఎవరో తనకు తెలియదని సమాధానమిచ్చానని పృథ్వీ అన్నారు. తెలియని వాడి గురించి సినిమాలో తానెందుకు చేస్తానని చెప్పానని అన్నారు. ఈ సినిమాలో తనది ఒక బాధ్యత లేని పనికిమాలిన వెధవ క్యారెక్టర్ అని.. బారుల్లో తాగుతూ, అమ్మాయిలతో డ్యాన్స్ చేసే పాత్ర అని అన్నారు. దర్శకుడు సముద్రఖని చెప్పిన క్యారెక్టర్ కు తాను న్యాయం చేశానని, అంబటి రాంబాబు క్యారెక్టర్ కు న్యాయం చేయాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా తన పాత్ర గురించే టాక్ నడుస్తోందని అన్నారు. మధ్యలో సినిమాలు వదిలి బయటకు వెళ్లిన తాను మళ్లీ వచ్చి చేసిన సినిమా ఇదని అన్నారు.
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ఈ చిత్రం 'వినోదయ సీతమ్' అనే తమిళ మూవీకి రీమేక్‌గా వచ్చింది. దీన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. దీనికి థమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా చేశారు. బ్రో సినిమాకి మూడు రోజుల్లో మంచి కలెక్షన్స్ వచ్చాయి. నైజాంలో రూ. 17.45 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.56 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.74 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.93 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 3.74 కోట్లు, గుంటూరులో రూ. 4.00 కోట్లు, కృష్ణాలో రూ. 2.75 కోట్లు, నెల్లూరులో రూ. 1.39 కోట్లతో కలిపి రూ. 44.56 కోట్లు షేర్, రూ. 72.50 కోట్లు గ్రాస్ వచ్చింది.