రెండో పెళ్లిపై మంచు మనోజ్‌ ఏమన్నారంటే

Actor manoj comments on his wedding news. సినీ హీరో మంచు మనోజ్‌ రెండో పెళ్లి అంటూ సోషల్‌ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.

By అంజి  Published on  27 Oct 2021 2:53 PM IST
రెండో పెళ్లిపై మంచు మనోజ్‌ ఏమన్నారంటే

సినీ హీరో మంచు మనోజ్‌ రెండో పెళ్లి అంటూ సోషల్‌ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఓ విదేశీ యువతిని మంచు మనోజ్‌ పెళ్లి చేసుకోబోతున్నారని, వారి ఫ్యామిలీ సైతం వివాహ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై మంచు మనోజ్‌ షాక్‌ గురయ్యారు. అవన్నీ ఫేకు వార్తలేనని మనోజ్‌ కొట్టి పారేశారు. పెళ్లి సంబంధించిన వార్తలన్నీ అవాస్తవాలేనని తేల్చి చెప్పారు. '' దయ చేసి.. నన్ను కూడా మ్యారేజ్‌కి పిలవండి, ఇంతకీ మ్యారేజ్‌ ఎక్కడ చేస్తున్నారు? ఆ బుజ్జి, తెల్ల పిల్ల ఎవరు.. మీ ఇష్టం రా అంతా మీ ఇష్టం'' అంటూ మంచు మనోజ్‌ ట్వీట్‌ చేశారు.

డైవర్స్‌ అనంతరం మంచు మనోజ్‌ సింగిల్‌గా ఉంటున్నారు. మరోసారి మనోజ్‌ పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిసి వచ్చింది. 2015లో హైదరాబాద్‌కు చెందిన ప్రణతీరెడ్డిని మనోజ్‌ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని మనస్పర్థల వల్ల ఇరువురు అంగీకారంతో 2019లో తమ పెళ్లి బంధానికి స్వస్తి పలికారు. అప్పటి నుండి మనోజ్‌ రెండో పెళ్లిపై ఎన్నోసార్లు రుమార్లు వస్తూనే ఉన్నాయి. మనోజ్‌ తాజా క్లారిటీతోనైనా.. ఈ అవాస్తవ వార్తలు ఆగుతాయేమో చూడాలి. మనోజ్‌ సినిమాల విషయానికి వస్తే.. పాన్‌ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటోన్న ''అహం బ్రహ్మాస్మి'' సినిమాలో నటిస్తున్నారు.

Next Story