ప్రముఖ సినీ నటుడి ఇంట.. తీవ్ర విషాదం

Actor maharshi raghava mother passed away. ప్రముఖ నటుడు మహర్షి రాఘవ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నటుడు రాఘవ తల్లి గోగినేని కమలమ్మ

By అంజి  Published on  16 Feb 2022 12:10 PM GMT
ప్రముఖ సినీ నటుడి ఇంట.. తీవ్ర విషాదం

ప్రముఖ నటుడు మహర్షి రాఘవ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నటుడు రాఘవ తల్లి గోగినేని కమలమ్మ మృతి చెందారు. 84 సంవత్సరాల వయస్సులో కమలమ్మ బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆమెకు ఇద్దరు కొడుకులు కాగా.. పెద్ద కొడుకు నటుడు రాఘవ సినీ, టీవీ కార్యక్రమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక రెండో కొడుకు వెంకట్‌ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. గురువారం నాడు జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో గోగినేని కమలమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. తల్లి కమలమ్మ మృతి చెందడంతో.. పలువురు సినీ, టీవీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. నటుడు రాఘవకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు.

సీనియర్‌ దర్శకుడు వంశీ తెరకెక్కించిన 'మహర్షి' సినిమాలో హీరోగా నటించి బాగా పాపులర్‌ అయ్యారు రాఘవ. ఆ తర్వాత మహర్షి పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. దాదాపు 150కిపైగా సినిమాల్లో రాఘవ నటించారు. `సూర్యవంశం`, `కోరుకున్న ప్రియుడు`, `జంబలకిడిపంబ`, `శుభాకాంక్షలు`, `చిత్రం భళారే విచిత్రం` వంటి సినిమాలతో రాఘవకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం పలు టీవీ సీరియల్స్‌లో నటిస్తున్న రాఘవ.. అప్పుడప్పుడు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటిస్తున్ఆనరు. తల్లి కమలమ్మ మృతితో రాఘవ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story
Share it