రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబం చేసిన గొప్ప పని

Actor Krishnam Raju. పని మనుషులను తమ సొంత కుటుంబ సభ్యులుగా చూసే గొప్ప మనసు అతి తక్కువ మందికి

By Medi Samrat  Published on  21 Oct 2021 7:58 PM IST
రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబం చేసిన గొప్ప పని

పని మనుషులను తమ సొంత కుటుంబ సభ్యులుగా చూసే గొప్ప మనసు అతి తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. అలాంటి ఫ్యామిలీగా రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబం నిలిచింది. తాజాగా కృష్ణంరాజు ఇంట్లో పాతికేళ్లుగా పద్మ అనే ఆవిడ పనిచేస్తున్నారు. గత 25 సంవత్సరాలుగా తమ బాగోగులు చూసుకుంటూ నమ్మకంగా ఉన్న పద్మ తమ వద్ద పని చేసి పాతిక సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు కృష్ణంరాజు కుటుంబ సభ్యులు. ఆమెను సన్మానించారు కూడానూ..! 25 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అంటూ ఆమె చేత కేక్ కట్ చేయించారు కృష్ణంరాజు దంపతులు. పద్మ వారి ఆశీర్వాదం తీసుకున్నారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి, పద్మకు గోల్డ్ ఛైన్ గిఫ్ట్‌గా ఇచ్చారు.

ఇన్నేళ్లుగా తమకు తోడుగా ఉన్న పద్మకు థ్యాంక్స్ చెబుతూ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ప్రభాస్ సోదరి ప్రసీద ఉప్పలపాటి. ప్రభాస్ మంచితనం గురించి సోషల్ మీడియాలోనూ, సినీ ప్రముఖులు ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అది తమ కుటుంబంలోనే ఉందని ఇలా తెలిసింది. ప్రస్తుతం ప్రభాస్ పలు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఎప్పుడెప్పుడు ప్రభాస్ సినిమాలు వస్తాయా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక ఈ నెల 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు.. చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేయడానికి అభిమానులు కూడా రెడీ అయిపోతూ ఉన్నారు.


Next Story