హీరో జీవాకు రోడ్డు ప్ర‌మాదం

కోలీవుడ్ హీరో జీవా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

By Medi Samrat  Published on  11 Sept 2024 5:12 PM IST
హీరో జీవాకు రోడ్డు ప్ర‌మాదం

కోలీవుడ్ హీరో జీవా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. చెన్నై నుంచి సేలం వైపు ఆయన కారులో తన భార్యతో పాటు ప్రయాణిస్తున్న సమయంలో కన్నియమూర్ వద్ద ఒక బైక్ ను తప్పించే ప్రయత్నంలో కారు పక్కనే ఉన్న బారికేడ్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో జీవా, ఆయన భార్య సుప్రియ చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

నటుడు జీవా "రంగం" సినిమా ద్వారా తెలుగులో మంచి పాపులారిటీని తెచ్చుకున్నాడు. "యాత్ర 2" సినిమాలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో కనిపించాడు. జీవాకు ఏమైందోనని ఆయన అభిమానులు టెన్షన్ పడుతూ ఉన్నారు.

Next Story