ఆర్. నారాయణమూర్తికి అస్వస్థత
ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి అస్వస్థతకు గురయ్యారు.
By Medi Samrat
ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. నారాయణమూర్తికి నిమ్స్ వైద్యుడు డాక్టర్ బీరప్ప చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. నారాయణమూర్తి అనారోగ్యం గురించి తెలుసుకున్న ఆయన శ్రేయోభిలాషులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నారాయణ మూర్తి త్వరగా కోలుకోవాలని పలువురు సోషల్ మీడియా ద్వారా ఆకాంక్షించారు.
నారాయణ మూర్తి ఎర్ర సైన్యం, చీమల దండు వంటి విజవంతమైన విప్లవాత్మక చిత్రాలలో నటించారు. ఉద్వేగ భరితంగా, ముక్కుసూటి తనంతో మాట్లాడటం ఆయన నైజం. స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్‌పై నారాయణ మూర్తి తన చిత్రాలను చాలా వరకు నిర్మించారు. తన సినిమాల ద్వారా ఆయన వామపక్షవాదిగా ముద్రింపబడ్డారు. ఆయన సినిమాలు పేద, అణగారిన, నిస్సహాయులపై అఘాయిత్యాలను ఎత్తిచూపడమే కాదు.. సమాజంలోని ఉన్నత వర్గాల దోపిడీని కూడా ప్రశ్నిస్తాయి.