గోవాలో గాయ‌ప‌డ్డ‌ ప్ర‌ముఖ న‌టుడు.. ఆసుప‌త్రికి త‌ర‌లింపు..

Actor Diganth suffers sports injury. ప్రముఖ కన్నడ నటుడు దిగంత్ మంచాలే మెడకు బలమైన గాయం కావడంతో

By Medi Samrat
Published on : 22 Jun 2022 9:09 AM IST

గోవాలో గాయ‌ప‌డ్డ‌ ప్ర‌ముఖ న‌టుడు.. ఆసుప‌త్రికి త‌ర‌లింపు..

ప్రముఖ కన్నడ నటుడు దిగంత్ మంచాలే మెడకు బలమైన గాయం కావడంతో ఆస్పత్రిలో చేరారు. ఈ ఘటన జరిగినప్పుడు 38 ఏళ్ల దిగంత్ తన కుటుంబంతో కలిసి హాలీడే టూర్ నిమిత్తం గోవాలో ఉన్నాడు. దిగంత్ బీచ్‌లో పల్టీ కొట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతని మెడకు గాయమైందని స‌మాచారం. దిగంత్‌ను వెంటనే గోవాలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతనికి ప్రథమ చికిత్స అందించారు. తదుపరి చికిత్స కోసం బెంగుళూరులోని మణిపాల్ ఆసుపత్రికి విమానంలో తరలించినట్లు అతని కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు.

నివేదికల ప్రకారం.. దిగంత్ న‌డుము, కాళ్ళకు గాయాలయ్యాయి. దిగంత్‌తో కలిసి అతని భార్య ప్రముఖ నటి ఐంద్రితా రే చికిత్స కోసం బెంగళూరుకు వెళ్లారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దిగంత్‌కు గాయాల‌వ‌డం ఇదే మొదటిసారి కాదు. 2016లో ఓ బాలీవుడ్ సినిమా షూటింగ్‌లోనూ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. అనేక‌ శ‌స్త్ర చికిత్స‌ల అనంత‌రం కోలుకున్నాడు.

దిగంత్ 2006లో మిస్ కాలిఫోర్నియా చిత్రంతో కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. 2008లో విడుదలైన గాలిపాట చిత్రంలోని 'దూద్ పెడ' పాత్ర ద్వారా అతను బాగా పేరు తెచ్చుకున్నాడు. అతను ఇటీవలే అంతు ఇంతు అనే కన్నడ చిత్రానికి సంతకం చేసాడు, ఇది రొమాంటిక్ కామెడీగా రూపొందించబడింది. 2018లో దిగంత్ తన సహనటి ఐంద్రితా రేను వివాహం చేసుకున్నాడు. ఆమె బెంగాలీ, హిందీ చిత్రాలలో కూడా నటించింది.





Next Story