ఆ న‌టుడు తాను బ‌తికే ఉన్నాన‌ని చెప్పాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది..!

సోషల్ మీడియాలో సెలెబ్రిటీలు చనిపోయారంటూ పోస్టులు పెడుతూ ఉంటారు. గతంలో పలువురు సెలెబ్రెటీలకు సంబంధించి అలాంటి ప్రకటనలే వచ్చాయి

By Medi Samrat  Published on  22 July 2024 9:11 PM IST
ఆ న‌టుడు తాను బ‌తికే ఉన్నాన‌ని చెప్పాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది..!

సోషల్ మీడియాలో సెలెబ్రిటీలు చనిపోయారంటూ పోస్టులు పెడుతూ ఉంటారు. గతంలో పలువురు సెలెబ్రెటీలకు సంబంధించి అలాంటి ప్రకటనలే వచ్చాయి. తాజాగా ప్రముఖ టీవీ నటుడు దేవేన్ భోజానీ మరణించారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని నటుడే స్వయంగా వివరణ ఇచ్చారు. ఒక సోషల్ మీడియా వినియోగదారు ఇటీవల X లో దేవేన్ భోజానీ చనిపోయినట్లుగా ఒక సంతాప పోస్ట్ రాశారు. అందుకు సంబంధించి పలువురు ఆయన ఆత్మకు శాంతిచేకూరాలంటూ కామెంట్లు చేయడం.. పోస్టులను షేర్ చేయడం చేస్తూ వచ్చారు. అయితే తాను బతికే ఉన్నానంటూ దేవేన్ భోజానీ బదులిచ్చారు. తాను బతికే ఉన్నానంటూ దేవేన్ ట్విట్టర్ లో పోస్టు పెట్టారు. "Hello! Hello! Hello! I’m alive yaar" అంటూ బతికే ఉన్నానని తెలిపారు.

సారాభాయ్ వర్సెస్ సారాభాయ్' షోలో దుష్యంత్ పాత్రలో దేవెన్ భోజానీ అత్యంత ప్రజాదరణ పొందారు. దేవెన్ గత రెండు సంవత్సరాలుగా టీవీకి దూరంగా ఉన్నారు. సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటించడంపై దృష్టి సారించాడు. 'డుంకీ', 'స్కూప్', 'అగ్నీపథ్' సినిమాలలో చెప్పుకోదగ్గ పాత్రలు పోషించారు.

Next Story