ఆ హీరోలు అలా చేస్తే అడగరెందుకు.. అనసూయ ఆగ్రహాం.!

Actor anasuya fire on senior actor. బుల్లితెర యాంకర్‌ అనసూయ జబర్దస్‌తో పాటు సినిమాలు చేస్తూ మంచి క్రేజ్‌ను దక్కించుకుంది. సోషల్‌ మీడియాలో చాలా

By అంజి  Published on  19 Oct 2021 4:36 AM GMT
ఆ హీరోలు అలా చేస్తే అడగరెందుకు.. అనసూయ ఆగ్రహాం.!

బుల్లితెర యాంకర్‌ అనసూయ జబర్దస్‌తో పాటు సినిమాలు చేస్తూ మంచి క్రేజ్‌ను దక్కించుకుంది. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అనసూయ.. తనదైన శైలిలో రియాక్ట్‌ అవుతూ ఉంటారు. తాజాగా ఓ సీనియర్‌ నటుడిపై అనసూయ ఫైర్ అయ్యారు. ఎవరికి నచ్చిన దుస్తులు వారు ధరిస్తారని, అది వారి వ్యక్తిగతమంటూ ఆయనపై మండిపడ్డారు. ఈ విషయాన్ని అనసూయ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఓ సీనియర్‌ నటుడు నేను వేసుకునే దుస్తులపై కామెంట్‌ చేయడం చాలా బాధ కలిగించిందన్నారు. దుస్తులు ధరించడమనేది వ్యక్తిగత అంశమని, పలు సందర్భాల్లో, వృత్తి పరంగా కొన్ని విభిన్న దుస్తులు ధరించాల్సి వస్తుందని అనసూయ అన్నారు.

అనవసరమైన విషయాలను సోషల్‌ మీడియా హైలెట్‌ చేస్తోందన్నారు. ఆ సీనియర్‌ నటుడు మద్యం సేవించిన, ఆన్‌స్క్రీన్‌లో మహిళలను కించపరిచే విధంగా ప్రవర్తించిన, చిరిగిన బట్టలు తొడుక్కున్నా సోషల్‌ మీడియా హైలెట్‌ చేయలేకపోవడం ఆశ్చర్చపడాల్సిన విషయమన్నారు. ఇప్పుడున్న స్టార్‌ హీరోలకి పెళ్లి పిల్లలున్నారని... ఆ హీరోలు హీరోయిన్లతో ఆన్‌స్క్రీన్‌లో రొమాన్స్‌ చేస్తే ఎవరూ ప్రశ్నించరెందుకు? అంటూ సీనియర్‌ నటుడిపై ఫైర్‌ అయ్యారు. షర్టులు వేసుకోకుండా తమ శరీరాన్ని చూపించే స్టార్‌ హీరోలను ఎందుకు ప్రశ్నించరని అనసూయ అన్నారు. ఇంతకి ఆ నటుడి పేరు మాత్రం అనసూయ ఎక్కడా చెప్పకపోవడం గమనార్హం.

Next Story
Share it