అదిరిపోయేలా 'సిద్ధ' లుక్

Acharya Movie Sidda Look Released. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటిస్తున్న 'ఆచార్య' సినిమా టాలీవుడ్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్

By Medi Samrat  Published on  10 July 2021 4:59 PM IST
అదిరిపోయేలా సిద్ధ లుక్

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటిస్తున్న 'ఆచార్య' సినిమా టాలీవుడ్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. ఈ చిత్రం ప్రారంభమైనప్పటి నుండి అనేక కారణాల వల్ల వాయిదాలు జరుగుతున్నాయి. ఆచార్య ఆఖరి షెడ్యూల్ మొదలైందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. రామ్ చరణ్ కు సంబంధించిన పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు. రామ్ చరణ్ సిద్ధగా నటిస్తున్నారు. మందపాటి మీసం, భక్తి వస్త్రధారణలో అతన్ని చూడవచ్చు. సినిమాలో ఈ క్యారెక్టర్ అదిరిపోతుందని.. అతనిని చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు.

కోరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి షూటింగ్ పూర్తవ్వడానికి 10 రోజులు కావాల్సి ఉంది. ఇందులో రామ్ చరణ్ ఫైట్ సీక్వెన్స్ హైలైట్ అవుతుందని చెబుతున్నారు. యాక్షన్ డ్రామాగా పేరుపొందిన ఆచార్య చరణ్ నక్సలైట్ సిద్ధ పాత్రలో నటించారు. పూజా హెగ్డే నీలంబరి పాత్రలో నటించగా, కాజల్ అగర్వాల్ చిరంజీవి సరసన కనిపించనుంది. చిరంజీవి పాత్రకు శిష్యుడి పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తాడు. దాదాపు నాలుగు నెలల తర్వాత మళ్ళీ ఆచార్య షూటింగ్ లో పాల్గొంటున్నాడు రామ్ చరణ్. ఈ షెడ్యూల్ తో తన పాత్ర చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని సమాచారం. కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న ఆచార్య చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.



Next Story