ఖమ్మంలో 'ఆచార్య' సినిమా షూటింగ్.. బొగ్గుగనుల వద్ద భారీగా అభిమానులు
Acharya Movie Shooting In Khammam. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ 'ఆచార్య' సినిమా షూటింగ్.
By Medi Samrat Published on 7 March 2021 4:15 PM ISTమెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ 'ఆచార్య'. ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. అటు కమర్షియల్ విలువ, ఇటు సందేశంతో కూడిన ఆచార్య సినిమా చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథనాయికగా నటిస్తోంది. ఇందులో రామ్ చరణ్ కీలకపాత్ర పోషిస్తున్నారు.
అయితే ఈ సినిమా షూటింగ్ ఖమ్మం జిల్లా ఇల్లెందులో జరగనుంది. ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ ఇల్లెందులో పర్యటించారు. ఇక్కడి జేకే మైన్స్‌లో షూటింగ్ జరిపేందుకు నిర్ణయించారు. అనుమతుల కోసం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను కూడా ఆచార్య చిత్ర బృందం కలిసింది. దీంతో మార్చి 7 (ఈరోజు) నుంచి మార్చి 15వ తేదీ వరకు ఈ సినిమా షూటింగ్ కొనసాగనుంది. ఇల్లెందులోని జేకే మైన్స్ లో ఓపెన్ కాస్ట్, భూగర్భ గనుల్లో చిరంజీవి, రామ్ చరణ్ లపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. మెగాస్టార్ అలాగే రామ్ చరణ్ వస్తున్నారని తెలియడంతో బొగ్గు గనుల వద్ద భారీగా అభిమానులు చేరుకుంటున్నారు. ఎలాంటి ఆటంకాలు కలుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఇక చిరంజీవి, రామ్ చరణ్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇంట్లోనే బస చేశారు.
కాగా, అనుకున్నట్లుగానే మెగాస్టార్ చిరంజీవి మనసు దోచేలా ఆచార్య మూవీ తెరకెక్కిస్తున్నారు కొరటాల. మరో నెల రోజుల్లో ఈ మూవీ షూటింగ్ పూర్తి కానుంది. మే 13న విడుదల కానుంది ఆచార్య. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో దుమ్ము దులిపేస్తున్నాడు మెగాస్టార్. చిరు గత సినిమాల రికార్డులన్నీ తిరగరాసేలా ఉన్నాయి. అన్నయ్య. నైజాంలో ఇప్పటికే వరంగల్ శ్రీను 42 కోట్లకు రైట్స్ సొంతం చేసుకున్నాడు. మరోవైపు ఆం6ధ్రా, సీడెడ్ కలిపి 60 కోట్లకు పైగానే ఆచార్య బిజినెస్ జరుగుతుంది. మరోవైపు ఓవర్సీస్ కూడా అన్నయ్య రేంజ్‌కు ఏ మాత్రం తీసిపోవడం లేదు. అక్కడా ఆచార్య అదరగొడుతున్నాడు.