Aamir Khan Dances To RRR's Naatu Naatu With Alia Bhatt. ఢిల్లీలో నిర్వహించిన ఆర్ఆర్ఆర్ ప్రమోషనల్ ఈవెంట్‌కు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ హాజరయ్యారు.
By Medi Samrat Published on 21 March 2022 7:48 AM GMT
ఢిల్లీలో నిర్వహించిన ఆర్ఆర్ఆర్ ప్రమోషనల్ ఈవెంట్‌కు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ హాజరయ్యారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని స్టార్ కాస్ట్‌తో మాట్లాడడమే కాకుండా.. RRR సినిమా లోని పాపులర్ పాట 'నాటు నాటు'కి కూడా డ్యాన్స్ చేశారు. అలియా భట్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆమిర్ ఖాన్‌కి పాటకు స్టెప్పులు నేర్పించారు. ప్రమోషనల్ ఈవెంట్ కు సంబంధించి ఆమిర్ డ్యాన్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రమోషనల్ ఈవెంట్‌కు అమీర్ ఖాన్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. నాటు నాటు హిందీలో నాచో నాచో అనే పేరు పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒకేలా స్టెప్పులు వేయడం తెలిసిందే..! నవంబర్‌లో విడుదలైన ఈ పాట దేశాన్ని ఓ ఊపు ఊపింది.
ఆర్‌ఆర్‌ఆర్ కథని విజయేంద్ర ప్రసాద్ రాశారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంగీతం ఎంఎం కీరవాణి ఇవ్వగా..! కెకె సెంథిల్‌కుమార్ కెమెరా పనితనం హైలైట్ అని చెబుతున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించబడింది. రెమ్యునరేషన్ ను మినహాయించి ₹ 336 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడింది. స్వాతంత్ర్య సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల పాత్రల ఆధారంగా కల్పిత పాత్రలతో రూపొందించబడిన చిత్రం.అజయ్ దేవగన్ అతిధి పాత్రలో కనిపించారు. మార్చి 25 న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషలలో విడుదల కానుంది.