57 ఏళ్ల నటుడు.. 24 ఏళ్ల అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నాడు..!

56 Year Old Tamil Actor Married A 23 Year Old Girl. దక్షిణాది నటుడు పృథ్వీరాజ్‌ తన రిలేషన్ షిప్ గురించి ఓపెన్ అయ్యాడు.

By Medi Samrat  Published on  30 Oct 2022 3:21 PM IST
57 ఏళ్ల నటుడు.. 24 ఏళ్ల అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నాడు..!

దక్షిణాది నటుడు పృథ్వీరాజ్‌ తన రిలేషన్ షిప్ గురించి ఓపెన్ అయ్యాడు. 57 ఏళ్లున్న పృథ్వీరాజ్‌ 24 ఏళ్ల అమ్మాయితో రిలేషన్‌లో ఉంటున్నాడని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు నిజమేనని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చాడు. పృథ్వీరాజ్‌ రెండో పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన క్లారిటీ ఇచ్చాడు.

తాను రెండో పెళ్లి చేసుకోలేదని చెప్పుకొచ్చాడు. నా భార్య బీనాకు, నాకు ఆరేళ్ల నుంచి గొడవలు జరుగుతున్నాయి. దాంతో నేను ఆమె నుంచి విడిపోయి ఒక్కడినే వేరుగా ఉండి.. ఒంటరితనంతో కుంగుబాటుకు గురయ్యాను. ఆ సమయంలో శీతల్‌ పరిచయమైంది. మా ఇద్దరి అభిరుచులు కలిశాయి. మొదట స్నేహితులమయ్యాం. ఇప్పుడు రిలేషన్‌లో ఉన్నామని తెలిపారు. నా గురించి శీతల్‌ కుటుంబసభ్యులందరికీ తెలుసు. మా పెళ్లికి వాళ్లందరూ అంగీకారం తెలిపారు. శీతల్‌ వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే. ఆమె ఎంతో పరిణతి చెందిన వ్యక్తని చెప్పుకొచ్చాడు.

చివరగా.. నాకు ఇప్పుడు 57 సంవత్సరాలు. ఆ అమ్మాయికి 24 ఏళ్లు. ఇంకా తను మలేషియాకు చెందిన అమ్మాయి కాదు, తెలుగుమ్మాయే. శీతల్‌ నాతో పెళ్లికి సిద్ధంగా ఉంది. నిజానికి మొదట నేను పెళ్లికి ఒప్పుకోలేదు. ఆలోచించుకోమని చాలా సమయం ఇచ్చాను. కానీ ఆమె నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిందని అన్నాడు.



Next Story