అంబర్‌పేటలో దారుణం.. తమ్ముడిని చంపిన అన్న
By తోట వంశీ కుమార్ Published on 26 May 2020 12:42 PM IST
అంబర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నారెడ్డి నగర్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైయ్యాడు. సొంత తమ్ముడినే కత్తితో పొడిచి హత్య చేశాడో అన్న. మృతుడిని మునావర్(32)గా గుర్తించారు. మునావర్ పదేండ్ల క్రితం ఓ యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే.. దంపతులు మనస్పర్థల కారణంగా గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. భార్య లేకపోవడంతో మునావర్ మద్యానికి బానిస అయ్యాడు. అప్పటి నుంచి మునావర్ రోజు మద్యం తాగి వచ్చి అన్న షాహిద్‌తో గొడవ పడేవాడని స్థానికులు చెబుతున్నారు.
ఈ క్రమంలో సోమవారం రాత్రి కూడా తాగి వచ్చిన మునావర్ అన్నతో గొడవపడ్డాడు. కోపోద్రిక్తుడైన అన్న షాహిత్ కత్తితో తమ్ముడిని విచక్షణారహితంగా పొడిచాడు. దీంతో మునావర్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.