పోలీసులకు ఎనిమిది గంటల షిఫ్ట్.. నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Aug 2020 11:40 AM GMT
పోలీసులకు ఎనిమిది గంటల షిఫ్ట్.. నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు

చండీఘడ్ కు చెందిన పోలీసు హెడ్ కానిస్టేబుల్ జగ్జీత్ సింగ్ స్పెషల్ లీవ్ పిటీషన్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. పోలీసులకు కూడా ఎనిమిది గంటల షిఫ్ట్ కావాలని, వీక్లీ ఆఫ్స్ ఇవ్వాలని కోరుతూ సుప్రీం కోర్టును కోరాడు.

దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు యూనియన్ టెర్రిటరీ ఆఫ్ చండీగఢ్, పంజాబ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులను జారీ చేసింది. అన్ని పోలీసు స్టేషన్స్ లోనూ ఎనిమిది గంటల షిఫ్ట్ ను అమలు చేయాలని.. అలాగే వీక్లీ ఆఫ్ లపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

స్పెషల్ లీవ్ పిటీషన్ ను జగ్జీత్ సింగ్ వేయడాన్ని చాలా మంది పోలీసులు హర్షిస్తున్నారు. పోలీసులు చాలా వరకూ ఆరోగ్యాలను పట్టించుకోకుండా డ్యూటీని చేస్తున్నారు. ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉన్నాయని పలువురు గతంలోనే తెలిపారు. జగ్జీత్ సింగ్ పిటీషన్ ద్వారా పోలీసులు కూడా ఇకపై వీక్లీ ఆఫ్ లు తీసుకునే వెసులుబాటు కలుగనుంది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

Next Story