శ్రేష్ఠ పథకం ద్వారా అత్యున్నత విద్యకు ఆహ్వానం

Scheme for Residential Education for Students in High Schools in Targeted Areas. స్కీం ఫర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హయ్యర్ క్లాస్స్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్

By Medi Samrat  Published on  16 March 2022 4:36 PM IST
శ్రేష్ఠ పథకం ద్వారా అత్యున్నత విద్యకు ఆహ్వానం

శ్రేష్ఠ (స్కీం ఫర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హయ్యర్ క్లాస్స్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్) ద్వారా భారత ప్రభుత్వం ప్రతిభావంతులైన షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు సిబిఎస్ఇ అఫిలియేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్ నందు పూర్తి ఉచితంగా అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యని అందిస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు తెలిపారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ౩౦౦౦ మంది విద్యార్థులకు 9 వ తరగతి, 11 వ తరగతిలో ప్రవేశం కోసం అవకాశం కలిపించడం జరుగుతుందన్నారు. షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల డ్రాప్ అవుట్ రేట్ ను నియంత్రించే ప్రయత్నం లో భాగంగా అర్హులైన విద్యార్థులకు ఈ అవకాశం ఉపయోగ‌ప‌డుతుంద‌ని గంధం చంద్రుడు తెలిపారు.

9వ తరగతి లో అడ్మిషన్ పొందిన విద్యార్థులు 11 వ తరగతి వరకు, 11 వ తరగతి లో అడ్మిషన్ పొందిన విద్యార్థులు 12 వ తరగతి వరకు విద్యాబ్యాసం చేస్తారని, 12వ తరగతి తరువాత పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనం పథకం, టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ పథకం ద్వారా ఉన్నత విద్యని అభ్యసించేందుకు అవకాశం లభిస్తుందన్నారు. https://jnanabhumi.ap.gov.in/ వెబ్ లింక్ ద్వారా పథకం మార్గదర్శకాలు లభ్యం అవుతాయని, https://shreshta.nta.nic.in/. వెబ్ లింక్ ద్వారా అర్హులైన విద్యార్థిని విద్యార్థులు ఏప్రిల్ 12 లోపు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు సూచించారు.

Next Story