జనవరి 31 వరకు స్కూళ్లు, కాలేజీలు మూసివేత.. వారికి మాత్రం తరగతుల నిర్వాహణ
Puducherry Schools, Colleges closed till January 31 due to COVID. జనవరి 31 వరకు స్కూళ్లు, కాలేజీలు మూసివేత.. వారికి మాత్రం తరగతుల నిర్వాహణ
By అంజి Published on 19 Jan 2022 9:03 AM GMTపుదుచ్చేరి పాఠశాలలు, కళాశాలలు జనవరి 31, 2022 వరకు మళ్లీ మూసివేయబడ్డాయి. కోవిడ్-19 కేసుల పెరుగుదల కారణంగా, విద్యా శాఖ అన్ని విద్యా సంస్థలను మూసివేయాలని పిలుపునిచ్చింది. కోవిడ్-19 కేసుల సంఖ్య పెరగడంతో, పుదుచ్చేరి విద్యా శాఖ జనవరి 31 వరకు అన్ని పాఠశాలలు, కళాశాలల్లో శారీరక తరగతులను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. పుదుచ్చేరిలో మంగళవారం 2,093 తాజా కోవిడ్ కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి. టెస్ట్ పాజిటివిటీ రేటు 34.72 శాతానికి చేరుకుంది.
కేంద్రపాలిత ప్రాంతంలో కరోనా వైరస్ విస్తరిస్తున్నందున 10 నుంచి 12వ తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహించే అన్ని పాఠశాలలను జనవరి 31 వరకు మూసివేస్తున్నట్లు పుదుచ్చేరి హోం, విద్యాశాఖ మంత్రి ఎ నమశ్శివాయం మంగళవారం తెలిపారు. ఈ నెలాఖరు వరకు కళాశాలలు కూడా మూసి ఉంటాయని వైద్య, విద్యాశాఖ అధికారులతో ముందుగా చర్చించిన అనంతరం ఆయన విలేకరులతో అన్నారు. 15 నుంచి 18 ఏళ్లలోపు విద్యార్థులకు మహమ్మారి వ్యాక్సిన్ వేస్తున్నందున ప్రభుత్వం 10 నుంచి 12వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తోందని, అలాగే కళాశాలల్లో విద్యార్థులకు కూడా ఈ వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నారని తెలిపారు.
"వైరస్ యొక్క ప్రస్తుత పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే.. హయ్యర్ సెకండరీ పాఠశాలల్లోని అన్ని తరగతులు, కళాశాలలు కూడా మూసివేయబడతాయి" అని ఆయన చెప్పారు. ఇప్పటికే జనవరి 10 నుంచి ఒకటి నుంచి 9వ తరగతి వరకు రద్దు చేసినట్లు తెలిపారు. ఇప్పుడు ఫిజికల్ క్లాస్‌లను రద్దు చేసినప్పటికీ ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తామని నమశ్శివాయం చెప్పారు. ఇప్పటికే 60 శాతానికిపైగా విద్యార్థులకు ఈ వ్యాధి నివారణ టీకాలు వేశారు. పాఠశాలలు పునఃప్రారంభం కాగానే మిగిలిన వాటికి టీకాలు వేస్తామని తెలిపారు. 20 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకాలు వేయడానికి అనుమతి ఇవ్వలేదన్నారు. ఎ. నమశ్శివాయం మాట్లాడుతూ పాఠశాలలు పునఃప్రారంభం కాగానే టీకాలు వేయడానికి తల్లిదండ్రులు అనుమతి ఇచ్చిన 15 శాతం మంది విద్యార్థులకు టీకాలు వేస్తామని తెలిపారు. ఆన్‌లైన్ తరగతులకు హాజరు కావాలని మరియు తరగతులను కోల్పోవద్దని పిలుపునిచ్చారు.