ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎంబీబీఎస్‌ విద్యార్థులకు ఆ పాఠాలు ప్రత్యేకంగా బోధించాలని..

MBBS 1st year students to now read about Hindutva icons. ఎంబీబీఎస్ విద్యార్థుల కోసం మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది.

By అంజి  Published on  6 Sep 2021 2:08 AM GMT
ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎంబీబీఎస్‌ విద్యార్థులకు ఆ పాఠాలు ప్రత్యేకంగా బోధించాలని..

ఎంబీబీఎస్ విద్యార్థుల కోసం మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ నేతలతో పాటు ఇతర మహనీయుల గురించి క్లాసులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫౌండేషన్ కోర్సులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యవస్థాపకుడు కేశవరావు బలిరాం పంత్ హేడ్గెవార్, భారతీయ జనసంఘ్‌ నేత దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, స్వామి వివేకానం, డా.బి.ఆర్.అంబేద్కర్‌తో పాటు సుశత్రుడు, చరకుడు గురించి ప్రత్యేకంగా బోధించనున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో నైతిక, మానవత్వ విలువలు పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు.

జాతీయ మెడికల్ కౌన్సిల్ సూచన మేరకు ఫౌండేషన్ కోర్సులో భాగంగా నైతిక విలువలు విద్యార్థుల జీవితాల్లో భాగం కావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సారంగ్ వివరించారు. నూతనంగా ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం నుండి మహానుభావుల జీవితాల పాఠ్యాంశాలను బోధించనున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరంలో మధ్యప్రదేశ్‌లో 2000 మంది ఎంబీబీఎస్‌లో చేరుతుంటారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీన్‌దయాళ్, హేడ్గేవార్‌తో పాటు గాడ్సే గురించి కూడా బోధించాల్సిందంటూ కాంగ్రెస్ నేత అరుణ్ యాదవ్ వ్యంగ్యంగా ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.


Next Story