శుభవార్త.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు!

పోస్టుమెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ దరఖాస్తు గడువు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 31తో గడువు ముగియనుండగా...

By -  అంజి
Published on : 28 Dec 2025 1:05 PM IST

Telangana, students, Post-matric scholarships, fee reimbursement, College students

శుభవార్త.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు!

హైదరాబాద్‌: పోస్టుమెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ దరఖాస్తు గడువు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 31తో గడువు ముగియనుండగా విద్యార్థుల నుంచి స్పందన లేకపోవడంతో అధికారులు ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు. ఏటా సగటున 12.55 లక్షల మంది e PASS వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుంటుండగా 2025 - 26లో ఈ సంఖ్య 7.65 లక్షలు మాత్రమే ఉంది. గడువు పొడిగింపుపై ఎల్లుండిలోగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. 2026 - జనవరి 31వ తేదీ వరకు దరఖాస్తు గడువు పొడిగించాలని సంక్షేమ శాఖలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి.

టెన్త్‌ క్లాస్‌, ఆపై చదువులు చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దాదాపు ఇంకా 5 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉందని సమాచారం. గడువు పొడిగించాలని సంక్షేమ శాఖలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి. త్వరలోనే ప్రభుత్వం దీనిపై సానుకూల నిర్ణయం తీసుకునే ఛాన్స్‌ ఉంది. అన్ని కాలేజీలు, యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు వెంటనే ఈ పాస్ వెబ్సైట్ - https://telanganaepass.cgg.gov.in ద్వారా తమ స్కాలర్షిప్ దరఖాస్తులను సమర్పించుకోవచ్చు. విద్యా సంస్థల నిర్వహకులు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ నమోదుపై అవగాహన కల్పించి, ఆన్లైన్ నమోదు ప్రక్రియను సమయానికి పూర్తిచేసేలా సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

Next Story