2025 క్రిస్మస్‌ను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు సెలవులకు సిద్ధమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని సూళ్లకు రేపటి నుంచి 3 రోజులు సెలవులు రానున్నాయి. తెలంగాణ ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం, సెలవులు డిసెంబర్ 24 బుధవారం నుండి ప్రారంభమవుతాయి. తెలంగాణలో 24న క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇచ్చారు. 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే సందర్భంగా జనరల్ హాలిడేస్ ప్రకటించారు. మిషనరీ పాఠశాలలు డిసెంబర్ 23 నుండి 27 వరకు ఐదు రోజుల పాటు క్రిస్మస్ సెలవులను పాటిస్తాయి.
అటు ఆంధ్రప్రదేశ్‌లో 24, 26 ఆప్షనల్, 25న జనరల్ హాలిడేస్ ఇచ్చారు. జనరల్ హాలిడే రోజు అన్ని స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ఉండనుంది. ఆప్షనల్ హాలిడేకు కొన్ని స్కూళ్లు సెలవు ప్రకటిస్తాయి. అయితే ప్రైవేట్ నాన్ మైనారిటీ స్కూళ్లు తమ యాజమాన్య నిర్ణయం ప్రకారం సెలవులు ప్రకటించవచ్చు. క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు మాత్రం క్రిస్మస్ సందర్భంగా ఎక్కువ రోజుల సెలవులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే అధికారిక ఉత్తర్వు విడుదలైన తర్వాతే స్పష్టత వస్తుంది.