కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం యశస్వీ స్కాలర్‌షిప్ స్కీమ్ దరఖాస్తుకు ఆగస్టు 31 ఆఖరు తేదీ. 9, 11వ తరగతి చదువుతున్న ఓబీసీ, ఈబీసీ, డీ నోటిఫైడ్ వర్గాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. సదరు తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2.5 లక్షలకు మించరాదు. 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తున్న (టాప్ క్లాస్ స్కూల్స్) పబ్లిక్, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లికేషన్లను ఆన్‌లైన్‌లో నోడల్ ఆఫీసర్లు ధ్రువీకరిస్తారు. విద్యార్థులకు ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు చెల్లించేలా స్కాలర్‌షిప్ మొత్తాన్ని ఒకేసారి జమ చేస్తారు. 9, 10 తరగతులకు ఏడాదికి రూ.75 వేలు, 11, 12 తరగతులకు రూ.1,25,000 చొప్పున స్కాలర్‌షిప్‌లు చెల్లిస్తారు. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా 30 వేల మందికి స్కాలర్‌షిప్స్ ఇస్తారు. ఇందలో 30 శాతం స్కాలర్‌షిప్‌లను బాలికలకు కేటాయించారు. పూర్తి వివరాలకు https://scholarships.gov.in/ విజిట్ చేయండి.