సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 21 న విడుదల చేయాల్సిన 10, 12 తరగతుల ఫలితాలను వాయిదా వేసింది. ఈద్ పండుగ సందర్భంగా ఈరోజు పరీక్షాఫలితాలు వెల్లడి చేయడం లేదని బోర్డు తెలిపింది. ఈద్ సందర్భంగా గెజిట్ లో సెలవు రోజు అనీ, కానీ ఈరోజు సిబిఎస్‌ఈ అధికారులకు మాత్రం సెలవు లేదని చెప్పారు. 12 వ తరగతి ఫలితాలను సిద్ధం చేసి విడుదల చేయాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు పరీక్షా కంట్రోలర్ సన్యం భరద్వాజ్ తెలిపారు. సిబిఎస్‌ఈ 12 వ తరగతి ఫలితాన్ని ఖరారు చేసే చివరి తేదీని జూలై 25 సాయంత్రం 5 కు పొడిగించింది. గడువు సమయంలోపు ఫలితాల వెల్లడి కోసం పాఠశాలలకు సహాయం చేయడానికి, సిబిఎస్‌ఈ ప్రాంతీయ కార్యాలయాలు వారి ప్రధాన కార్యాలయంలోని పరీక్షా విభాగం ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుందని సిబిఎస్‌ఈ తెలియజేసింది.
ఈమెయిల్, వాట్సాప్ మొదలైన వాటి ద్వారా వివిధ పాఠశాలల నుండి వచ్చిన ప్రశ్నలకు సంబంధించి తరచుగా అడిగే ప్రశ్నల జాబితాను విడుదల చేస్తామని సిబిఎస్‌ఈ తెలియజేసింది. పాఠశాలలు తగిన చర్యలు తీసుకునే విధంగా తరచుగా అడిగే ప్రశ్నల జాబితాను పాఠశాలలకు అందిస్తారు. ఈ ఏడాది సిబిఎస్‌ఈ పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో పరీక్షలు నిర్వహించలేదు. ప్రత్యేకంగా మార్కులను ఇచ్చారు. సిబిఎస్‌ఈ 11, 12 థియరీ మార్కుల మోడరేషన్ కోసం టేబులేషన్ పోర్టల్ ను తెరిచింది. పట్టిక పోర్టల్ cbse.gov.in లో అందుబాటులో ఉంచింది.