సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూల్‌లో బోర్డు స్వల్ప సవరణలు చేసింది. సీబీఎస్‌ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలకు సంబంధించి సవరించిన తేదీలతో కూడిన షెడ్యూల్‌ శుక్రవారం విడుదలైంది. సీబీఎస్‌ఈ 10,12వ తరగతులకు సంబంధించి ముందుగా ఫిబ్రవరి 2న షెడ్యూల్‌ను విడుదల చేసింది. తాజాగా ఆ షెడ్యూల్‌లో స్వల్ప సవరణలు చేసింది. సవరించిన షెడ్యూల్‌ను విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని సీబీఎస్‌ఈ తెలిపింది.


అయితే ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు మే 15వ తేదీన జ‌రుగాల్సిన 10వ త‌ర‌గ‌తి సైన్స్ ప‌రీక్ష మే 21వ తేదీకి వాయిదాప‌డింది. మే 21వ తేదీన జ‌రుగాల్సిన మాథ్స్ ప‌రీక్షను జూన్ 2కు వాయిదా వేశారు. అలాగే 12వ త‌ర‌గ‌తి సంబంధించి సైన్స్ స్ట్రీమ్‌లో మే 13న జరుగాల్సిన ఫిజిక్స్ ప‌రీక్ష‌ జూన్ 8కి వాయిదా ప‌డింది. ఇక‌ మ్యాథ‌మాటిక్స్‌, అప్ల‌యిడ్ మ్యాథ‌మాటిక్స్ ప‌రీక్ష‌లు మే 31న జ‌రుగ‌నున్నాయి.

కాగా, సాధారణంగా, ప్రాక్టికల్ పరీక్షలు జనవరిలో నిర్వహిస్తారు. రాత పరీక్షలు ఫిబ్రవరిలో ప్రారంభమై మార్చిలో ముగుస్తాయి. అయితే, కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని పరీక్షలు ఈ సెషన్‌ను ఆలస్యంగా ప్రారంభం అవుతున్నాయి.


సామ్రాట్

Next Story