Applications Invited For APKGBV Admission. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 352 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల
By Medi Samrat Published on 1 Jun 2021 10:13 AM GMT
రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 352 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ)ల్లో 2021-22 విద్యా సంవత్సరానికి గానూ 6వ, 11వ తరగతుల్లో ప్రవేశం కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె. వెట్రిసెల్వి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలానే అన్ని కేజీబీవీల్లో 7, 8 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం కూడా విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చని కోరారు.
అనాథ, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్ (బడి మానేసినవారు), పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బీపీఎల్ బాలికలు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. ఆన్ లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కోసం పరిగణింపబడతాయని తెలిపారు. ఇప్పటికే కేజీబీవీల్లో పదో తరగతి చదువుతున్న బాలికలు కూడా 11వ తరగతిలో ప్రవేశానికి ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
దరఖాస్తులను ఈ నెల 3వ తేదీ నుంచి 20 తేదీ వరకు https://apkgbv.apcfss.in/ వెబ్సైట్ ద్వారా పొందవచ్చని శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థినులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం పంపబడుతుంది. అలానే సంబంధిత పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో నేరుగా చూడవచ్చని అన్నారు. ఏవైనా సమస్యలు, సందేహాలు ఉంటే 94943 83617 లేదా 94412 70099 నంబర్లను సంప్రదించాలని కోరారు.