ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కేవ‌లం తన బినామీల కోసమే బస్సు యాత్ర చేపడుతున్నారని.. ఆయ‌న‌ను తిట్టాలని ఉందని.. రాయ‌డానికి వీలుకాని తీవ్ర‌మైన ప‌రుష ప‌ద‌జాలాన్ని వాడుతూ తిట్టారు. తానొక ప్ర‌జాప్ర‌తినిధిని అనే మాట మ‌రిచి.. చంద్రబాబుని లం….కా, వె…న అని తిట్టాలని ఉందని అంటూ అస‌భ్య‌క‌ర‌మైన‌ వ్యాఖ్య‌లు చేశాడు.

మొన్న‌టి ఎన్నిక‌ల్లో చంద్రబాబుకి సరైన బుద్ధి చెప్పామ‌ని.. ఆ ము..డు మళ్లీ లేవకూడదు అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బాగా పనిచేయాలని వైసీపీ కార్య‌క‌ర్త‌లకు చెబుతూనే.. ప్ర‌తిప‌క్ష నేత‌పై పైర్ అయ్యాడు. అలాగే.. చంద్రబాబు కొడుకు పప్పు లోకేష్ కు కూడా కొవ్వు కరిగేలా బుద్ధి చెప్పాలని ద్వారంపుడి వ్యాఖ్యానించారు.

అలాగే.. జ‌న‌సేన అధ్య‌క్షుడు పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్ అని.. చంద్రబాబు చెప్పుచేతల్లో నడిచే నువ్వు కూడా ఒక నాయకుడివేనా అంటూ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేకాకుండా.. పవన్ కళ్యాణ్ ఒక దొం…..కు అని, లం.. చేసే పనులన్నీ పవన్ కళ్యాణ్ చేస్తున్నాడ‌ని వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు.

అమరావతిలో బినామిను బయటకు తేవాలని.. అసలు రాజధానిని వెంటనే విశాఖప‌ట్నంకు తరలించాలని.. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను జైల్లో వేయాలని తీవ్ర‌స్థాయిలో ద్వ‌జ‌మెత్తారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.