మ‌ద్యం మ‌త్తులో యువ‌కుడు హ‌ల్‌చ‌ల్‌.. చేతిలో పెట్రోల్ బాటిల్‌తో..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 May 2020 3:21 AM GMT
మ‌ద్యం మ‌త్తులో యువ‌కుడు హ‌ల్‌చ‌ల్‌.. చేతిలో పెట్రోల్ బాటిల్‌తో..

క‌రోనా కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు నానా క‌ష్టాలు ప‌డుతుంటే.. మందుబాబులు మాత్రం ఎంచ‌క్కా వారి ప‌నుల‌లో వారున్నారు. అస‌లే లాక్‌డౌన్ విధుల్లో క్ష‌ణం తీరిక లేకుండా ఉన్న పోలీసుల‌కు.. మ‌త్తెక్కాగా మందుబాబులు చేసే ప‌నులు పోలీసుల‌కు త‌ల‌నొప్పిగా మారాయి. తాజాగా ఓ యువ‌కుడు పూటుగా తాగి.. ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని పెట్రోల్‌ బాటిల్‌తో హ‌ల్‌చ‌ల్ చేశాడు.

వివ‌రాళ్లోకెళితే.. భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద మద్యం మత్తులో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకుంటానని యువకుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని యువకుడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనిపై పూర్తి వివ‌రాలు తెలియాల్సి వుంది.

[video width="640" height="352" mp4="https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/05/WhatsApp-Video-2020-05-16-at-8.33.45-AM.mp4"][/video]

Next Story