నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం నాకతండా వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టిప్పర్‌ను స్కార్పియో వాహనం ఢీకొడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. స్కార్పియో వాహనంలో బీహార్‌ నుంచి కేరళలోని కోజికోడ్‌ ప్రాంతానికి బయలుదేరారు. ఈ క్రమంలో డిచ్‌పల్లి నాక తండా వద్దకు రాగానే ఆగివున్న టిప్పర్‌ను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కార్పియోలో ప్రయాణిస్తున్నవారిలో ముగ్గురు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతి చెందిన వారు అనేష్‌ (30), స్టాలిన్‌ (22), అనాలియా (16) గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాగా, దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా శనివారం ఉదయం వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడం విషాదం మరింది. ఉత్తరప్రదేశ్‌లో వలస కూలీలతో వెళ్తున్న ట్రక్కు మరో ట్రక్కును ఢీకొనడంతో 23 మంది వలస కూలీలు మృతి చెందడం తీవ్రంగా కలచివేస్తోంది. అతివేగం.. అజాగ్రత్తగా వాహనం నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి అమాయ ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *