మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు కన్నుమూత

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Oct 2020 11:14 AM GMT
మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే, వీఎంఆర్డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూశారు. ఆయనకు కరోనా సోకడంతో నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినా.. ఇతర సమస్యలతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆదివారం ఆయన పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు.

విశాఖ వన్‌టౌన్‌ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన విశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(వీఎంఆర్డీఏ) చైర్మన్‌గా ఉన్నారు. అపర రాజకీయ చాణిక్యుడు ద్రోణంరాజు సత్యనారాయణ కుమారుడుగా ద్రోణంరాజు శ్రీనివాస్‌కు ఉత్తరాంధ్రలో చెరగని ముద్ర వేశారు. ద్రోణంరాజు శ్రీనివాస్ కు భార్య శశి, కుమార్తె శ్వేత, కుమారుడు శ్రీవత్సవ ఉన్నారు. శ్రీనివాస్ మృతి పట్ల మంత్రి అవంతి శ్రీనివాస్‌ రావు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

Next Story