లైసెన్స్ లేకపోతే జైలుకే.. వాహనదారులకు చెమట్లు పట్టిస్తున్న సర్కార్‌ నిర్ణయం..!

By అంజి  Published on  6 Jan 2020 1:03 PM GMT
లైసెన్స్ లేకపోతే జైలుకే.. వాహనదారులకు చెమట్లు పట్టిస్తున్న సర్కార్‌ నిర్ణయం..!

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ అభివృద్ధి పథంలో దూసుకుపోతంది. సీఎం జగన్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. ఇప్పుడు మరో నిర్ణయానికి వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం కారణంగా ఎంతో మంది తమ ప్రాణాలను వదులుతున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు భారీ జరిమానాలు విధించిన వాహనదారుల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ రూల్స్‌ను కఠినతరం చేసేందుకు సీఎం జగన్‌ సర్కార్‌ సిద్దమైంది. లైసెన్స్‌ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే నేరుగా జైలుకి పంపించేలా కొత్త ట్రాఫిక్‌ రూల్‌ తీసుకొచ్చింది.

ఒక్క 2019 సంవత్సరంలోనే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 88,872 మంది లైసెన్స్‌ లేకుండా పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. రోడ్డు భద్రతపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ చెప్పిన దాని ప్రకారం.. లైసెన్స్‌లు లేకుండా బండి నడిపిన వారిని జైలుకు పంపనున్నారు. కాగా లైసెన్స్‌ లేని వాహనాదారులపై కోరడా ఝులిపించేందుకు జగన్‌ సర్కార్‌ రెడీ అవుతోంది. ఈ సంవత్సరం 20 శాతం రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. డ్రైవింగ్‌ లైసెన్స్‌లను తనిఖీలు చేపట్టనున్నారు. లైసెన్స్‌ విషయంలో విద్యార్హతను కేంద్ర కొత్త మోటరు వాహనం చట్టం నిబంధనల మేరకు తొలగించింది. లైసెన్స్‌లు మరింత సులభంగా జరీ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోంటోంది. త్వరలో సైంటిఫిక్‌ డ్రైవింగ్‌ టెస్ట్ ట్రాక్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి. దీంతో వాహనదారులకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకోవడం మరింత ఈజీ కానుంది. మరీ జగన్‌ సర్కాన్‌ తీసుకున్న ఈ నిర్ణయానికైనా వాహనదారుల్లో మార్పు వస్తుందో చూడాలి.

Next Story