కరోనా టైమ్‌: జంక్‌ఫుడ్‌ తగ్గించాలంటున్న నిపుణులు..

By అంజి  Published on  2 April 2020 7:53 PM IST
కరోనా టైమ్‌: జంక్‌ఫుడ్‌ తగ్గించాలంటున్న నిపుణులు..

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లో ఉంటూ ఏది పడితే అది తినడం మంచిది కాదని, టీవీకి అతుక్కుపోయి కాలక్షేపం చేస్తుండటం కూడా అనారోగ్యానికి దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు. చిరుతిళ్ల అనవసర కొవ్వు శరీరంలోకి చేరి ఇబ్బందులు తీసుకొవద్దని హోలిస్టిక్‌ న్యూట్రిషనిస్ట్‌లు చెబుతున్నారు.

లాక్‌డౌన్‌ కారణంగా అందరూ ఇంటికి పరిమితమయ్యారు. దీంతో రోటిన్‌ జీవనానికి భిన్నంగా గడిపే ఈ సమయం ఎంతో కీలకమైనది. ఈ సమయంలో తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు విటమిన్‌- సి పుడ్స్‌ తినాలని, బత్తాయిలు, జామకాయలు, బత్తాయి, ఉసరికాయ, ఫైనాఫిల్‌ పండ్లు తినాలని నిపుణులు చెబుతున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మందిలో విటమిన్‌-డి లోపం ఉందని, అలాంటి వారందరూ ఉదయం సమయంలో సూర్యరశ్మి పడేటప్పుడు ఫిజికల్‌ యాక్టివిటిస్‌ చేస్తే విటమిన్‌-డి అందుతుంది. ఇది మన శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తిని పెంచేందుకు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.

అలాగే రోజు కనీసం 8 గంటల నుంచి 9 గంటలు నిద్రపోవడం వల్ల కూడా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని నిపుణులు అంటున్నారు. డీప్‌ బ్రీత్‌ తీసుకోవడం వల్ల.. ఊపిరితిత్తుల పని తీరు మెరుగుపడుతుందని అమెరికా లంగ్‌ అసోసియేషన్‌ చెబుతోంది.

ఖాళీగా ఉన్నామని ఇష్టమొచ్చినట్లు జంక్‌ఫుడ్స్‌ తింటే అనారోగ్యానికి గురవుతాము. అనవసరంగా తినడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గడంతో పాటు, బరువు పెరుగుతారు. అయితే ఫ్రూట్స్‌, నట్స్‌తో పాటు నానబెట్టిన పెసళ్లు, శనగలు తింటే మంచిదేనని నిపుణులు అంటున్నారు.

Next Story