మృతదేహాలను పీక్కుతింటున్న కుక్కలు..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 July 2020 12:02 PM IST
మృతదేహాలను పీక్కుతింటున్న కుక్కలు..?

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి భారీన కోటి మందికిపైగా పడ్డారు. ఇక భారత్‌లోనూ ఈ వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఏ మాత్రం అలసత్వం వహించినా.. కరోనా బారీన పడకతప్పదు. కరోనాతో మరణించిన వారి మృతదేహాలకు ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహిస్తోంది. కోవిడ్‌తో మరణించిన వారి నుంచి కూడా ఇన్ఫెక్షన్ ఇతరులకు సోకే అవకాశం ఉండటంతో.. అంత్యక్రియల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనాతో చనిపోతే.. మృతదేహాలు పూర్తిగా కాలకుండానే వదిలేస్తుండడంతో శరీర భాగాలను కుక్కలు పీక్కుతింటున్న అమానవీయ ఘటన హైదరాబాద్‌లోని సత్యహరిశ్చంద్ర శ్మశాన వాటిలో చోటు చేసుకుంద‌నే వార్త సోష‌ల్‌మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

Dogs eating Covid-19 patients dead bodies

గాంధీ ఆస్పత్రిలో ఎవరైనా కరోనాతో మృతి చెందితే.. ఆ మృతదేహాలను ఈఎస్‌ఐ సమీపంలోని సత్యహరిశ్చంద్ర శ్మశాన వాటిలో దహనం చేస్తున్నారని.. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ కూడా ముగ్గురు సిబ్బందిని నియమించిందని. అయితే.. మృతదేహాలు పూర్తిగా కాలకుండానే వదిలేస్తున్నార‌నే వార్త ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతుంది. అంతేకాదు సగం కాలిన డెడ్‌ బాడీలను కుక్కలు పీక్కుతింటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అయితే.. ఇదే విష‌య‌మై మ‌రో వార్త కూడా ప్ర‌చారంలో ఉంది. వీడియోలో కనిపించే శవాలకూ.. కరోనాకూ సంబంధం లేదని.. వాళ్లు కరోనా మృతులు కాదు.. పైగా ఆ వీడియో ఇప్పటిది కాదు.. 9 నెలల క్రితం వీడియో.. అప్పట్లో గుర్తుతెలియని యాచకుల మృతదేహాలకు సంబంధించిన వీడియో అని ఓ మెసేజ్ కూడా స‌ర్క్యూలేట్ అవుతుంది.

Next Story