తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మహిళల, బాలిక రక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దిశ పోలీస్‌స్టేషన్‌ ప్రారంభ కార్యక్రమం జరిగింది. తొలి దిశ పోలీస్‌స్టేషన్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సుచరిత, మోపిదేవి వెంకటరమణ, ఏపీఐఐసీ చైర్మన్‌ రోజా, డీజీపీ గౌతం సవాంగ్‌ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 దిశ పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేశారు. మహిళలు, బాలికలకు భద్రత, భరోసా కల్పిస్తూ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేశారు. దిశ చట్టం అమలు కోసం వైసీపీ ప్రభుత్వం సన్నహాలు చేస్తోంది. మహిళలకు భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు హోంమంత్రి సుచరిత తెలిపారు. ఒక్కో దిశ పీఎస్‌లలో ఇద్దరు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, 38 మంది కానిస్టేబుళ్లు ఉంటారు.

దిశ చట్టం ప్రకారం.. మహిళలపై రేప్‌, గ్యాంగ్‌ రేప్‌లకు పాల్పడితే ఉరిశిక్ష, చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితేత జీవత ఖైదు విధించనున్నారు. సోషల్‌ మీడియాలో మహిళలను వేధిస్తే మొదటిసారి రెండేళ్ల జైలు,రెండోసారి అదే తప్పు చేస్తే నాలుగేళ్ల జైలు శిక్ష పడనుంది. శిక్షపడిన దోషులు అప్పీలు చేసుకునేందుకు గడువు 45 రోజులే మాత్రమే. కాగా మంగళగిరి, విశాఖ, తిరుపతిలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లతో పాటు తిరుపతి, విశాఖల్లో కొత్తగా డీఎన్‌ఏ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. దిశ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే వారికి 30 శాతం అలెవెన్స్‌ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో మహిళా పోలీస్‌స్టేషన్ల అప్‌గ్రేడేషన్‌ చేయనున్నారు.

అంజి

Next Story