ఉత్కంఠభరితంగా ‘దిశ ఎన్ కౌంటర్’ ట్రైలర్

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 26 Sept 2020 9:58 AM IST

ఉత్కంఠభరితంగా ‘దిశ ఎన్ కౌంటర్’ ట్రైలర్

గతేడాది హైదరాబాద్‌ నగర శివారులో జరిగిన దిశ హత్య కేసు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దిశను అత్యంత పాశవికంగా హత్య చేసిన నిందితులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైయ్యారు. వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.. ఈ ఘటనను ఆధారంగా చేసుకుని దిశ ఎన్‌కౌంటర్‌ అనే చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆనంద్‌ చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

ఇప్పటికే ఈ సినిమాకు ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేసిన వర్మ.. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను ఈ ఉదయం 9 గంటల 08 నిమిషాలకు విడుదల చేశారు. దిశ బండికి గాలితీసేయడం.. శంషాబాద్ సమీపంలోని చటాన్ పల్లి దగ్గర నలుగురు నిందితులు దిశను కాల్చివేయడం తదితర ఘటనలు ట్రైలర్ లో చూపించాడు వర్మ. న‌వంబ‌ర్ 26, 2020లో సినిమా విడుద‌ల‌ కాబోతుంది.



Next Story