'దిశ ఎన్‌కౌంటర్‌' ఫస్ట్‌ లుక్‌ విడుదల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Sep 2020 6:16 AM GMT
దిశ ఎన్‌కౌంటర్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదల

నిత్యం వివాదాలో సావాసం చేసే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. కరోనా కాలంలో సినిమా షూటింగ్‌లకే అందరూ భయపడుతూ ఉండే.. వర్మ కంపెనీ మాత్రం వరుసగా సినిమాలు రిలీజ్‌ చేస్తూ వస్తున్నారు. గత ఏడాది నగర హైదరాబాద్‌ నగర శివార్లలో జరిగిన దిశ అత్యాచారం కేసు దేశ వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై చిత్రాన్ని తీస్తానని అప్పట్లో వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశాడు వర్మ. ఈ చిత్రం 'దిశ.. ఎన్‌కౌంటర్‌' పేరుతో తెరకెక్కుతోంది. ఈ పోస్టర్‌లో ఓ లారీ, స్కూటీ కనిపిస్తుండగా.. ఓ వ్యక్తి తుపాకీతో ఇంకొకరి కాలుస్తున్నట్లుగా ఉంది.

2019 నవంబ‌ర్ 26న శంషాబాద్ సమీపంలో లారీనీ నడిపే నలుగురు యువకులు ఒక యువతిపై అత్యాచారం చేసి కాల్చిచంపేశారు. అయితే ఆ తరువాత నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దిశ హ‌త్య నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో సామూహిక అత్యాచారం, హ‌త్య, కాల్చి చంప‌డం వంటి అంశాలను చూపించబోతున్నట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ 26 న ఈ సినిమా టీజర్, నవంబర్ 26 న సినిమా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు వర్మ.Next Story