ఎన్‌కౌంటర్‌పై 'సుప్రీం' త్రిసభ్య కమిషన్‌..!

By అంజి  Published on  12 Dec 2019 7:00 AM GMT
ఎన్‌కౌంటర్‌పై సుప్రీం త్రిసభ్య కమిషన్‌..!

ముఖ్యాంశాలు

  • సుప్రీంకోర్టులో దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసు
  • మిమ్మల్ని మేం తప్పుబట్టడం లేదు: సుప్రీంకోర్టు
  • తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ముకుల్‌ రోహత్గి
  • ఎన్‌కౌంటర్‌పై వీఎస్‌ సిర్‌పుర్కార్‌ అధ్యక్షతన కమిషన్‌ ఏర్పాటు

ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య ఘటన నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కావాలనే నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసినట్లు అర్థమవుతోందని పిటిషనర్‌ ఎం.ఎల్‌ శర్మ వాదించారు. కేసు విచారణలో భాగంగా మీరెందుకు పిటిషన్‌ వేశారని పిటిషనర్‌ను సీజే ప్రశ్నించారు. కాగా ఇది ఎన్‌కౌంటర్‌ కాదని.. ఉద్దేశపూర్వకంగానే నిందితులను కాల్చి చంపారని కోర్టుకు తెలిపారు. అసలు అక్కడ వాస్తంగా ఏం జరిగిందో ఎవరికీ తెలియదని సుప్రీంకోర్టు వ్యాఖ్యనించింది. అక్కడ ఎవరెవరు ఉన్నారు. వారి ర్యాంక్‌ ఏంటి? అని ధర్మాసనం ప్రశ్నించింది. నిందితులు తుపాకీ ఉపయోగించి ఫైర్‌ చేశారని తెలంగాణ ప్రభుత్వ తరఫు న్యాయవాది రోహత్గి తెలిపారు.

ఈ ఎన్‌కౌంటర్‌ పూర్తిగా అనుమానాస్పదమని సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. నలుగురు నిందితులు పోలీసుపై దాడి చేశారా? వారు లాగిన పిస్టల్‌తో పోలీసులపై కాల్పులు జరిపారా? అని కోర్టు ప్రశ్నించింది. నిందితుల బుల్లెట్‌ పోలీసులకు తాకలేదని సీజేకి న్యాయవాది రోహత్గి తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌పై ఉన్నతాధికారులతో విచారణ జరిపిస్తున్నామని ముకుల్‌ రోహత్గి తెలిపారు. కాగా పోలీసులు తమ ఆత్మరక్షణ కోసం నిందితులపై కాల్పులు జరిపారని తెలిపారు.

నిందితుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలంటూ పిటిషనర్‌ వాదనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. నిందితులను ప్రత్యేక చూడాల్సిన అవసరం లేదని.. ఆ నలుగురు చేసిన పనిని కళ్లు మూసుకొని చూస్తూ ఊరుకోలేమని వ్యాఖ్యనించింది. రిటైర్డ్‌ జస్టిస్‌తో విచారణ జరిపిస్తే హైకోర్టు, ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ నిలిపివేయాలని ముకుల్‌ రోహత్గి హైకోర్టును కోరారు. ఈ కేసుపై పూర్తి విచారణ జరగాల్సిన అవసరం ఉందని జిస్టిస్‌ బాబ్డే వ్యాఖ్యనించారు. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులుపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై ముగ్గురు సభ్యులతో కూడిన కమిషన్‌ ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఎన్‌కౌంటర్‌పై ఎన్‌కౌంటర్‌పై వీఎస్‌ సిర్‌పుర్కార్‌ అధ్యక్షతన కమిషన్‌ ఏర్పాటు చేసింది. రిటైర్డ్‌ జస్టిస్‌ వీఎస్ సిర్‌పుర్కార్‌, బాంబే హైకోర్టు రిటైర్డ్‌ జస్టిస్‌ రేఖ, రిటైర్డ్‌ సీబీఐ డైరెక్టర్‌ కార్తికేయన్‌ను నియమించిన సుప్రీంకోర్టు నియమించింది. కమిషన్‌కు సీఆర్ఫీఎఫ్‌ భద్రత కల్పిస్తుందని.. కమిషన్‌ ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని సుప్రీంకోర్టు తెలిపింవది. కమిషన్‌ విచారణపై మీడియా కవరేజ్‌ ఉండకూడదని పేర్కొంది. ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలని త్రిసభ్య కమిషన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.

Next Story