వణుకు పుట్టిస్తున్న దిశ నిందితుల నేర చరిత్ర.!

By అంజి  Published on  18 Dec 2019 4:20 AM GMT
వణుకు పుట్టిస్తున్న దిశ నిందితుల నేర చరిత్ర.!

హైదరాబాద్: షాద్ నగర్ దిశ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దిశపై అత్యచారం చేసి ఆపై పెట్రోల్ నిప్పంటించారు నలుగురు దుండగులు. అయితే వాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. ఎన్‌కౌంటర్‌కు ముందు నిందితులు ఇచ్చిన చివరి వాంగ్మూలం పోలీస్ అధికారులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. దిశతో పాటు అంతకుముందు మరో తొమ్మిది మందిని దారుణంగా చంపినట్లు నిందితులు వెల్లడించారు. నిందితుల నేరాల చిట్టా అధికారులను విస్మయానికి గురి చేసింది. దిశ కేసులో ఏ1 నిందితుడైన అరిఫ్ అలీ 6 హత్యలు, చెన్నకేశవులు 3 హత్యలు చేశామని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. నిందితులు మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్‌, కర్నాటక, మహారాష్ట్రలో లారీ నడిపేవారు. హైవే రోడ్లపై వెళ్తున్నప్పుడు ఈ దారుణాలకు ఒడిగట్టామని నిందితులు పోలీసులు తెలిపినట్లు సమాచారం. తొమ్మిది మహిళలపై అత్యచారం, హత్య, అనంతరం మృతదేహాన్ని కాల్చేయడమే నిందితులు పనిగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

దిశ హత్యకు ముందు చేసిన హత్యల్లో వీరు పోలీసులకు పట్టుబడలేదు. అయితే ఆ కేసుల్లో పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా తెలుస్తోంది. నిందితులు తెలిపిన వివరాల ఆధారంగా హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు నిందితులు చెప్పిన హైవే ప్రాంతాల్లో మొత్తం 15 హత్యలు జరిగినట్లుగా గుర్తించిన పోలీసుల.. వాటికి సంబంధించిన డీఎన్‌ఏ రిపోర్టులను పరిశీలిస్తున్నారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో డీఏన్‌ఏ రిపోర్టులు పోలీసులకు ఉపయోగ పరిస్థితిలో లేవు. ఈ .నేపథ్యంలో శాస్త్రీయ పద్దతుల్లో నిర్ధారించాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే హత్యల వివరాలు సేకరించిన పోలీసులు నిందితుల డీఎన్‌ఏలతో విశ్లేషించనున్నారు. ఒక వేళ నిందితుల డీఏన్‌ఏతో మృతదేహాలకు సంబంధించిన డీఏన్‌ఏ పోలితే.. హత్యలకు సంబంధించిన చార్జీషిట్‌లో ఆధారాలను పొందుపర్చుతారు.

దిశ నిందితుల మృతదేహాలు ఇంకా గాంధీ ఆస్పత్రిలోనే ఉన్నాయి. మృతదేహాలు చెడిపోకుండా ఖరీదైన ఇంజెక్షన్లు ఇచ్చి భద్రపరిచారు. కాగా నిందితులు మృతదేహాలు క్రమక్రమంగా కుళ్లిపోతున్నాయని గాంధీ ఆస్పత్రికి వైద్యులు తెలిపారు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న కారణంగా మృతదేహాలను అంత్యక్రియలు నిర్వహించేందుకు అనుమతి లభించలేదు. సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిషన్‌ త్వరలోనే నిందితులను మృతదేహాలను పరిశీలించనుంది. కాగా మరోసారి మృతదేహాలకు ఎంబాల్మింగ్‌ చేస్తే రీపోస్టుమార్టంకు అవకాశం ఉండదని వైద్యులు పేర్కొంటున్నారు. మృతదేహాలను ఢిల్లీలోని అత్యాధునిక మార్చురీకి తరలించాలని తెలంగాణ పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story