చటాన్‌పల్లిలో చిన్నారి కిడ్నాప్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Dec 2019 4:51 PM GMT
చటాన్‌పల్లిలో చిన్నారి కిడ్నాప్..!

దిశ ఘ‌ట‌న‌తో దేశ‌వ్యాప్తంగా మారుమోగిపోయిన‌ రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండ‌లం చటాన్‌పల్లిలో మ‌రో దారుణం చోటుచేసుకుంది. స్నేహిత అనే నాలుగు సంవ‌త్స‌రాల‌ చిన్నారి ఈ రోజు సాయంత్రం ఇంటి వద్ద ఆడుకుంటుంటే గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

హైదరాబాద్ నుండి బెంగళూర్ వెళ్లే జాతీయ రహాదారిపై చటాన్‌ప‌ల్లి ప‌రిస‌ర ప్రాంతంలో ఉన్న‌ అశియానా హోటల్ వద్ద.. కిడ్నాపర్ ఆన‌వాళ్ల‌ను పోలీసులు గుర్తించారు. స్నేహితను ప‌ల్స‌ర్ బైక్ ఫై కూర్చోబెట్టుకొని తీసుకొని వెళుతున్న దృశ్యాల‌ను ఆశియానా హోటల్ సీసీ పుటేజీలో పోలీసులు గుర్తించారు. కిడ్నాప‌ర్ స్నేహిత‌ను ఎటువైపు తీసుకెళ్లాడ‌నే కోణంలో పోలీసులు వెతుకులాట ప్రారంభించారు.

Next Story
Share it