మీ ఊహాగానాలు ఆపండి.. ఆమె క్షేమంగానే ఉన్నారు
By తోట వంశీ కుమార్ Published on 9 Jun 2020 1:10 PM IST
'రాజుగాడు' సినిమా దర్శకురాలు ఎం.సంజనారెడ్డి తీవ్ర అస్వస్థతతో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేరారని, అధిక జ్వరం వల్ల మెదడులో రక్తస్రావం కావడంతో.. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతున్నారని వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై తాజాగా రచయిత, నిర్మాత కోన వెంకట్ స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదన్నారు.
సంజనారెడ్డి క్షేమంగా ఉన్నారని, రెండ్రోజుల్లో ఆమె ఇంటికి తిరిగి వచ్చేస్తారని ట్వీట్ చేశారు. 'మా 'కరణం మల్లీశ్వరి' డైరెక్టర్ సంజనా రెడ్డి క్షేమంగా ఉన్నారు. ఆమె వైరల్ ఫీవర్‌కు చికిత్స తీసుకుంటున్నారు. మరో రెండ్రోజుల్లో ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతార'ని కోన వెంకట్ ట్వీట్ చేశారు.
మహిళల వెయిట్ లిఫ్టింగ్‌లో ఒలింపిక్స్ మెడల్ సాధించిన కరుణం మల్లేశ్వరీ జీవిత కథ ఆధారంగా సంజనా రెడ్డి దర్శకత్వంలో ‘కరణం మల్లీశ్వరి’ బయోపిక్ రాబోతున్న విషయం తెలిసిందే.