శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా ప్రముఖ దర్శకుడు ఢమరుకం శ్రీనివాస్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి స్వామి సన్నిధిలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త వేంకటేశ్వర్లు (తిరుపతి), ఎస్వీబీసి ఛైర్మన్ పృథ్వీ.. తిరుపతి ఎంపీ దుర్గా ప్రసాద్, 'రాగల 24 గంటల్లో' చిత్ర నిర్మాత శ్రీనివాస్ కానూరు హాజరయ్యారు. వీరి సమక్షంలో బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని ఢమరుకం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.