భారత ప్రధాని నరేంద్ర మోదీ లోకల్ ప్రోడక్ట్స్ ను ఎంకరేజ్ చేయాలంటూ ఇటీవలి కాలంలో చెబుతూ వస్తున్నారు. అలా చేయడం వలనే భారతదేశ ఆర్థిక ప్రగతి అన్నది మెరుగవుతుందని చెప్పుకొచ్చారు. స్టార్టప్ సంస్థలు కూడా బొమ్మల తయారీకి పూనుకోవాలని మన్ కీ బాత్ కార్యక్రమంలో ఇటీవలి కాలంలో చెప్పుకొచ్చారు. మోదీ ఏది చెప్పినా అది రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి మంచి చేకూరుతుందని.. ఈ విషయంలో మీడియా కూడా రిలయన్స్ సంస్థ హామ్లే టాయ్స్ సంస్థను కొన్న విషయాన్ని బయటకు చెప్పకుండా ఉందని పలువురు ఆరోపణలు గుప్పించారు.

ప్రపంచంలోనే బొమ్మలకు కేంద్రంగా భారత్ నిలుస్తుందని మోదీ చెబుతున్నారని.. అందువలన బాగుపడేది ముఖేష్ అంబానీ అని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు. రిలయన్స్ సంస్థ హామ్లే టాయ్స్ ను కొనుక్కుందని.. ఆ సంస్థ 127 దేశాల్లో బొమ్మలను అమ్ముతోందని.. ఫ్యూచర్ గ్రూప్ సంస్థ రీటైల్ ఇండస్ట్రీలో లీడర్ అవుతుందని పోస్టులు పెట్టారు. మోదీ ఏది చెప్పినా దాని వెనుక అంబానీ, అదానీ పేర్లు ఉంటాయని పలువురు చెప్పుకొచ్చారు.

వైరల్ అవుతున్న పోస్టుల్లో రెండు విషయాలు ఉన్నాయి
1. హామ్లే సంస్థను రిలయన్స్ సంస్థ కొనుక్కోవడం
2. మీడియా ఈ విషయాన్ని బయటకు పొక్కనివ్వడం లేదు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న విషయం పాక్షికంగా నిజమే.

రిలయన్స్ సంస్థ హామ్లే టాయ్స్ సంస్థను కొనడం ఇప్పుడు చోటుచేసుకుంది కాదు. 2019 మే నెలలో రిలయన్స్ ఆ సంస్థను కొనుక్కుంది. ఆ సమయంలో పలు మీడియా సంస్థలు ఈ విషయాన్ని వెల్లడించాయి.

ఈ డీల్ గురించి Economic Times కూడా కథనాన్ని ప్రచురించింది. బ్రిటీష్ టాయ్ రిటైలర్ అయిన హామ్లేను 620 కోట్ల రూపాయల ఆల్ క్యాష్ డీల్ లో భాగంగా సొంతం చేసుకుంది రిలయన్స్.

1760 లో హామ్లే సంస్థను లండన్ లో స్థాపించారు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన బొమ్మల కంపెనీగా దీనికి పేరు ఉంది. ఈ కంపెనీ పలువురు చేతులు మారింది. హాంగ్ కాంగ్ బేస్ కంపెనీ అయిన సి.బ్యానర్ ఇంటర్నేషనల్ నుండి రిలయన్స్ సంస్థ హామ్లేను సొంతం చేసుకుంది.

BusinessToday.in కూడా ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ సంస్థ ఐకానిక్ టాయ్ మేకర్ సంస్థ అయిన హామ్లేను 620కోట్ల రూపాయలకు కొనుక్కుందని కథనాలను రాసుకుని వచ్చారు.

The Hindu Business line, Deccan Herald, Indian Express, Reuters, The Guardian వంటి మీడియా సంస్థలు కూడా రిలయన్స్ డీల్ గురించి కథనాలను రాసుకుని వచ్చాయి.

హామ్లే టాయ్స్ కు చెందిన వెబ్సైట్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ కు సంబంధించిన విషయాన్ని ప్రస్తావించలేదు. రిలయన్స్ బ్రాండ్స్ కు చెందిన ముంబై అడ్రెస్ ను అందులో చూడొచ్చు. అది కూడా డెలివరీ పాలసీ పేజీలో..!

“Reliance Brands Limited, a company incorporated under the laws of India, having it’s registered office at 5th Floor, Court House, Lokmanya Tilak Marg, Dhobi Talao, Mumbai City, Maharashtra – 400002, India (“Company”) అన్న దాన్ని గమనించవచ్చు.

www.hamleys.in మొబైల్ లోనూ ట్యాబ్లెట్స్ అప్లికేషన్స్ లో పని చేస్తుదని తెలిపారు. ఏదైనా వస్తువులు, బొమ్మలు, ఇతర వస్తువులు కొన్నా అది ‘హామ్లే బ్రాండ్’ కిందనే అని చెప్పారు.
https://www.hamleys.in/delivery-policy

01

రిలయన్స్ సంస్థ హామ్లే బొమ్మలను కొన్నది మే,2019లో.. దీని గురించి మీడియాలో రాసుకుని వచ్చారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టులు పాక్షికంగా ‘నిజమే.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *