కరోనా వైరస్ : ప్రాణాలు కాపాడబోతున్న డెక్సామెథసోన్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 Jun 2020 6:33 AM GMTకరోనా వైరస్ బారిన పడిన వారిలో మరణాల రేటును తగ్గించడానికి ప్రభుత్వాలు ఎంతగానో కష్టపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా నాలుగు దేశాల్లో కరోనా కారణంగా చనిపోతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. డెక్సామెథసోన్ అనే స్టెరాయిడ్ వలన ప్రాణాలు కాపాడవచ్చు అని చెబుతున్నారు ఇంగ్లాండ్ కు చెందిన రీసెర్చర్లు.
కరోనా కారణంగా వెంటిలేటర్లపై ఉన్న వారిని డెక్సామెథసోన్ ద్వారా కాపాడవచ్చని చెబుతున్నారు. కరోనా బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలను కాపాడుతున్నట్లు యూకేకు చెందిన పరిశోధకులు ‘రికవరి’ పేరుతో క్లినికల్ ట్రయిల్ నిర్వహించగా తెలిసొచ్చింది. డెక్సామెథసోన్ డ్రగ్ వెంటిలేటర్‌పై ఉన్న పేషంట్లను కాపాడుతున్నట్టు తేలింది. వెంటిలేటర్‌పై ఉన్న ప్రతి ముగ్గురు పేషంట్లలో ఒకరు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడుతున్నట్టు ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటి పరిశోధకులు వెల్లడించారు.
డెక్సామెథసోన్ చాలా తక్కువ కాస్ట్ అని కూడా వైద్యులు చెబుతున్నారు. కోవిద్-19 పేషేంట్లను కాపాడుతున్న మొదటి డ్రగ్ డెక్సామెథసోన్ అని అంటున్నారు. ఆక్సిజన్ అవసరం ఉన్న వారికి డెక్సామెథసోన్ బాగా పనిచేస్తోందని అన్నారు ప్రొఫెసర్ పీటర్ హార్బి.
కోవిద్-19 కారణంగా కొందరు.. కొంతవరకే ఇబ్బంది పడతారు.. మరికొందరు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు.. ఇమ్యూనిటీ శక్తి లేనప్పుడే చాలా వరకూ తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతాయని హార్వర్డ్ గ్లోబల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ ఆశిష్ కె ఝా తెలిపారు. డెక్సామెథసోన్ తక్కువ ధరకే లభించడం కాకుండా ప్రపంచవ్యాప్తంగా లభ్యమయ్యే డ్రగ్ అని తెలిపారు.
మంగళవారం నాటికి భారత్ లో 343091 కేసులు నమోదవ్వగా 9900 మరణాలు లభించాయి. 10667 కేసులు కొత్తగా నమోదయ్యాయి.. 380 మరణాలు కొత్తగా నమోదయ్యాయి. 10215 మందిని డిశ్చార్జ్ చేశారు. ఇప్పటివరకూ డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 180012 కు చేరింది. హెల్త్ మినిస్ట్రీ లెక్కల ప్రకారం రికవరీ రేట్ 52.47 శాతం ఉంది. 153178 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.