తెలంగాణలో 5,406 కరోనా కేసులు.. ఎక్కడ ఎన్ని కేసులంటే..

By సుభాష్  Published on  17 Jun 2020 2:04 AM GMT
తెలంగాణలో 5,406 కరోనా కేసులు.. ఎక్కడ ఎన్ని కేసులంటే..

తెలంగాణలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 213 కేసుల నమోదు కాగా, నలుగురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 5,406 కేసులు నమోదు కాగా, 191 మంది మృతి చెందారు. ఇక తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీలో 165 కేసులు నమోదు కావడంతో నగర వాసులు మరింత భయాందోళన చెందుతున్నారు. ఆ తర్వాత రంగారెడ్డిలో 16, మెదక్‌లో 13 కేసులు, కరీంనగర్ లో 6 కేసులు, మేడ్చల్ లో 3 కేసులు, ఆసిఫాబాద్ లో 1, కామారెడ్డి, జనగాంలో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి.

ఇప్పటి వరకూ రాష్ట్రలంఓ 3,027 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్‌ కాగా, ప్రస్తుతం 2,188 మంది చికిత్స పొందుతున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో 261 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.



Next Story