బెజ‌వాడ రాజ‌కీయం ఒక్క‌సారిగా హీటెక్కింది. టీడీపీకి తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ గుడ్ బై చెప్పారు. ఓ వైపు.. అధినేత చంద్ర‌బాబు ఇసుక దీక్ష చేస్తుంటే.. మ‌రోవైపు కీల‌క నేత‌లు పార్టీని వీడుతున్నారు. నిన్న నెహ్రూ అభిమానులు, అనుచ‌రుల‌తో భేటీ అయిన‌ అవినాష్.. పార్టీకి, తెలుగు యువత అధ్యక్ష పదవికి నేడు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి పంపించారు. అవినాష్‌తో పాటూ సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు కూడా పార్టీకి రాజీనామా చేశారు. దేవినేని అవినాష్ సాయంత్రం వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.