50 శాతం సిలబస్ కట్.. జులై 31 తర్వాత స్కూల్స్ ఓపెన్..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Jun 2020 3:45 PM GMT
50 శాతం సిలబస్ కట్.. జులై 31 తర్వాత స్కూల్స్ ఓపెన్..?

లాక్ డౌన్ లో సడలింపులు కేంద్రప్రభుత్వం అమలు చేస్తూ ఉన్నప్పటికీ స్కూల్స్, కాలేజీలు మాత్రం తెరవనివ్వడం లేదు. పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా స్కూల్స్ ఓపెన్ చేయడంపై ఇంకా అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఢిల్లీ ప్రభుత్వ అధికారులు మాత్రం పాఠశాలలను ఓపెన్ చేయాలని భావిస్తూ ఉన్నారు. ఢిల్లీ డెప్యూటీ ముఖమంత్రి మనీష్ సిసోడియా శుక్రవారం నాడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో చర్చించారు. ముఖ్యంగా 50 శాతం సిలబస్ ను తగ్గించాలని అధికారులు భావిస్తూ ఉన్నారు. ఆన్ లైన్ క్లాసులు నిర్వహించడంతో పాటూ, విద్యార్థుల చదువు విషయంలో తల్లిదండ్రులతో కూడా చర్చించనున్నారు.

పాఠశాలలను రీఓపెన్ చేయడానికి యాక్షన్ ప్లాన్ ను రెడీ చేయాలని.. ప్రస్తుతమున్న పరిస్థితులకు పిల్లలు కూడా అలవాటు పడేలా చేయాలని.. భయపడేలా చేయకూడదని.. సిసోడియా అన్నారు. తొమ్మిది పదో క్లాస్ విద్యార్థులకు చిన్న చిన్న గ్రూపులలో వారానికి ఒకసారి.. లేదంటే రెండు సార్లు క్లాసులు నిర్వహించాలని కొందరు అధికారులు కోరారు. మరికొందరు అధికారులు 10వ తరగతి విద్యార్థులకు మాత్రం ప్రతి రోజూ క్లాసులు నిర్వహించాలని కోరారు. విద్యార్థులకు ఆన్ లైన్ లైబ్రరీలను ఓపెన్ చేయడానికి అందరూ ఒప్పుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పలు సూచనలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం కోరుతోంది.

ముఖ్యంగా క్లాస్ రూమ్ లలో శానిటరీ పనులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం సూచిస్తోంది. పిల్లలకు మాస్క్ లు, స్కూల్ గేట్స్ వద్ద థర్మల్ స్క్రీనింగ్ వంటివి పటిష్టంగా చేపట్టాలని అన్నారు.

Next Story