ప్రభాస్‌ 21 సర్‌ప్రైజ్ వచ్చేసింది.. ఎంటంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 July 2020 11:35 AM IST
ప్రభాస్‌ 21 సర్‌ప్రైజ్ వచ్చేసింది.. ఎంటంటే..?

ప్రభాస్ అభిమానులు పండగ చేసుకునే అప్డేట్ ఇచ్చింది వైజయంతీ మూవీస్. 'రాధే శ్యామ్' చిత్రం తరువాత ప్రభాస్.. టాలెండెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్‌తో సోషియో ఫాంటసీ చిత్రాన్ని చేస్తున్నారు. ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాని రూపొందించనున్నారు. ఈ సినిమాని సంబంధించి ఓ సర్‌ప్రైజ్‌ ఇస్తామని శనివారం చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ చిత్రంలో నటిస్తున్న హీరోయిన్‌ వివరాలను వెల్లడించింది.

ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె నటిస్తోంది. ఈ విషయాన్ని వైజయంతి మూవీస్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా ప్రకటించింది. ఎంతో మంది బాలీవుడ్ భామ‌ల‌ని తెలుగు ప‌రిశ్ర‌మ‌కి ప‌రిచ‌యం చేసిన వైజ‌యంతి మూవీస్ ఈ సారి దీపికాని ఇంట్ర‌డ్యూస్ చేయ‌డం గ‌మ‌నార్హం. కాగా, ప్ర‌భాస్ చివ‌రి చిత్రం సాహోతో బాలీవుడ్ భామ శ్ర‌ద్ధా క‌పూర్ తెలుగు తెర‌కి ప‌రిచ‌యం అయిన విష‌యం తెలిసిందే.



రీసెంట్‌గా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘ప్రభాస్ 20’ చిత్రానికి సంబంధించి టైటిల్‌ను ప్రకటించారు. ‘రాధేశ్యామ్’ అనే టైటిల్‌తో రాబోతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు తన గోపీకృష్ణా మూవీస్ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా.. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో వంశీ, ప్రమోద్, ప్రశీదలు నిర్మిస్తున్నారు.

Next Story