బిచ్చగాడు-2 వచ్చేస్తోంది.. ఫస్టు లుక్‌ ఎప్పుడంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 July 2020 9:30 AM GMT
బిచ్చగాడు-2 వచ్చేస్తోంది.. ఫస్టు లుక్‌ ఎప్పుడంటే..?

నాలుగేళ్ల క్రితం సైలెంట్‌గా వచ్చిన బిచ్చగాడు చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విజయ్‌ ఆంటోనికి తెలుగులో మంచి పేరు తెచ్చిపెట్టింది. అమ్మసెంటిమెంట్‌తో ఈ సినిమా రేంజ్‌ పతాక స్థాయికి తీసుకువెళ్లింది. ఊహంకదని వసూళ్లను సాధించింది. శశికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సంగీత దర్శకుడు, నిర్మాత కూడా విజయ్‌ ఆంటోనినే కావడం విశేషం. ఇక ఈ సినిమాకి సీక్వెల్‌ తెరకెక్కనుందని ఎప్పటి నుంచో వార్తు వినిపించాయి.

తాజాగా దీనికి సంబంధించిన అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ మూవీపై విజయ్ తన ట్విట్టర్‌లో అప్డేట్ ఇచ్చారు. జూలై 24న విజ‌య్ ఆంటోని పుట్టిన రోజు కావడంతో.. ఆ రోజు చిత్ర ఫ‌స్ట్ లుక్‌ను వస్తుందని తెలిపారు. అంతేకాదు సినిమాకి సంబంధించి పూర్తి వివ‌రాలు కూడా వెల్ల‌డిస్తామని తెలిపారు. ఈ చిత్రంతో స్టోరీ రైటర్‌గా మారాడు విజయ్‌ అంటోని. ప్రస్తుతం ‘తమీజరాసన్‌’, ‘అగ్ని సిరగుగాల్‌’, ‘ఖాకీ’ చిత్రాలతో పాటు మరో మూడు సినిమాలలోనూ నటిస్తూ విజయ్‌ పుల్‌ బిజీగా ఉన్నాడు.Next Story