హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. యువతి (20)ని ఓ ఉన్మాది దారుణంగా హత్య చేశాడు. శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. హన్మకొండ రాంనగర్ లో షాహిద్ అనే యువకుడు ఓ యువతిని గొంతుకోసి దారుణంగా హతమార్చాడు. అనంతరం నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. కాగా, వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతుండగా, తరచూ యువతి, షాహిద్ మధ్య గొడవలు జరుగుతుండేవని తెలుస్తోంది.

గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న వీరు.. యువతి వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని, అందుకే తనను నిర్లక్ష్యం చేస్తోందనే అనుమానంతోనే కోపంతో రగిలిపోయి బ్లేడుతో యువతి గొంతును కోసి దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. యువతి కళాశాల ముగిసిన అనంతరం తన గదిలోకి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.