మైండ్ బ్లాక్ అవుద్దనుకుంటే వార్నరే మాయమైపోయాడు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 May 2020 3:12 AM GMT
మైండ్ బ్లాక్ అవుద్దనుకుంటే వార్నరే మాయమైపోయాడు..!

లాక్ డౌన్ లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఫ్యామిలీతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇండియన్ హీరోలను ఇమిటేట్ చేస్తూ ముఖ్యంగా తెలుగు హీరోల పాటలకు వాళ్ల స్టెప్పులు వేస్తూ నెటిజన్లకువినోదాన్ని పంచుతున్నాడు. మొన్నీమధ్య వార్నర్ బన్నీ సాంగ్ బుట్టబొమ్మ కు భార్యతో కలిసి స్టెప్పులేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఓహ్..వావ్..వార్నర్ లో ఈ యాంగిల్ కూడా ఉందంటూ ఇండియన్ క్రికెటర్లతో పాటు క్రికెట్ అభిమానులంతా వార్నర్ ను తెగ మోసేశారు.

ఆ తర్వాత మహేష్, ప్రభాస్ సినిమాల్లో బాగా పాపులర్ అయిన డైలాగులతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు..అదేనండి మే 20వ తేదీన తన స్టైల్ లో బర్త్ డే విషెస్ చెప్పాడు వార్నర్. జనతా గ్యారేజ్ లోని పక్కా లోకల్ సాంగ్ కు మరోసారి భార్యతో కలిసి స్టెప్పులేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు. ఇలా టిక్ టాక్ లో, ఇన్ స్టాలో తన అభిమానులతో పాటు తెలుగు సినీ అభిమానులను సైతం ఆకట్టుకుంటున్న వార్నర్ ఈ సారి మాత్రం నెటిజన్లు అవాక్కయేలా చేశాడు.

సరిలేరు నీకెవ్వరు సినిమాలోని మైండ్ బ్లాక్ పాటకు బ్యాట్ పట్టుకుని స్టెప్పులేస్తున్నట్లు ఫోజిచ్చిన వార్నర్ ఆ తర్వాత మాయమైపోయాడు. నిజంగా ఈ వీడియో చూసిన నెటిజన్లకు మైండ్ బ్లాక్ అయినంత పనైంది. అయ్యో! వార్నర్ స్టెప్పులేస్తాడనుకుంటే ఇలా చేశాడేంటి అని కొందరు నిరుత్సాహపడితే..మరికొందరు నెటిజన్లు ఆ పాటకు వార్నర్ స్టెప్పులేస్తే బాగోదని ఇలా చేశాడంటూ కామెంట్లు చేశారు.

Next Story