ప్రాణ‌హాని ఉంది.. ర‌క్ష‌ణ క‌ల్పించండి : ప్రభు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Jun 2020 10:20 AM GMT
ప్రాణ‌హాని ఉంది.. ర‌క్ష‌ణ క‌ల్పించండి : ప్రభు

దివంగత దర్శకదిగ్గ‌జం, ద‌ర్శ‌క‌ర‌త్న‌ దాసరి నారాయణరావు ఇంట్లో మ‌రోమారు ఆస్తి వివాదం రాజుకుంది. ఆయన కుమారులు దాసరి అరుణ్ కుమార్‌, ప్రభుల మధ్య ఆస్తి వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే దాసరి అరుణ్‌పై ఆయన సోదరుడు ప్రభు శుక్రవారం జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నెల 24న రాత్రి అరుణ్ కుమార్‌ తన ఇంటి గేటు దూకి లోపలికి వచ్చి తనపై, తన కుటుంబసభ్యులపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభు ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తన తమ్ముడు అరుణ్ నుంచి త‌మ‌కు ప్రాణహానీ ఉందని.. రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీ పెద్దలు.. ఈ విషయంలో జోక్యం చేసుకొని ఈ వివాదాన్ని పరిష్కరించాలని ప్రభు అన్నారు.

22

Next Story
Share it